హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హనుమాన్‌ జంక్షన్‌లో అరుదైన పునుగు పిల్లి కలకలం

కృష్ణ: హనుమాన్‌ జంక్షన్‌లో అరుదైన పునుగు పిల్లి కలకలం రేపింది. విజయవాడ రోడ్డులోని మధురం రెస్టారెంట్‌ జంక్షన్‌ సమీపంలో సోమవారం ఓ ఇంటి ఆవరణలో కనిపించింది. కోళ్లను వేటాడుతున్న పునుగును స్థానికులు గమనించారు. చనిపోయిన కోడిని ఎరగా ఉంచి పంజరం ఏర్పాటు చేయగా అందులో చిక్కుకుంది. స్థానికుల సమాచారంతో అటవీశాఖ సిబ్బంది వచ్చి దానిని స్వాధీనం చేసుకున్నారు.