హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీటీ రోడ్డు పనులు ప్రారంభం

BPT: బల్లికురవ మండలంలోని ఉప్పుమాగులూరు నుంచి కొణిదెన వరకు రూ.4.30 కోట్లతో నిర్మించనున్న బీటీ రహదారి పనులు ప్రారంభించారు. రహదారి నిర్మాణం పూర్తయితే ఉప్పుమాగులూరు, కొణిదెనతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు రాకపోకలు సులభతరం కానున్నాయి. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.