హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శాప్ ముట్టడి.. జక్కంపూడిని విడుదల

E.G: విజయవాడలో శాప్ కార్యాలయం ముట్టడి యత్నం కేసులో జక్కంపూడి రాజాతో పాటు 17 మంది యువజన నేతలను పోలీసులు రాత్రి 11 గంటలకు విడుదల చేశారు. మధ్యాహ్నం నుంచి వీరిని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. వీరిలో జోన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్ని కిట్టు, అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ఉన్నారు.