హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మైనింగ్ అధికారులు దాడులు.. లారీలు సీజ్

E.G: సీతానగరం మండలం మునికూడలిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను మైన్స్ అధికారులు సీజ్ చేశారు. సోమవారం అర్ధరాత్రి ఇసుక స్టాక్ పాయింట్ వద్ద అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బిల్లులు, అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేశారు. సీజ్ చేసిన రెండు లారీలను సీతానగరం పోలీస్ స్టేషన్కు తరలించారు.