PPM: ఈనెల 24న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించనున్నారు. బలిజిపేట మండలం పెదపెంకి తదితర ప్రాంతాలను ఆయన సందర్శించనుండటంతో కలెక్టర్ ప్రభాకరరెడ్డి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పర్యటనకు వేగంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల ప్రగతిని వివరించేలా ప్రదర్శనలు సిద్ధం చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకు డిప్యూటీ సీఎం రాక


