E.G: నల్లజర్ల మండలంలోని పుల్లలపాడు సమీపంలో రెస్టారెంట్ ఎదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు గాయపడినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, బాధితుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న నల్లజర్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
ఆంధ్రప్రదేశ్
రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరికి గాయాలు


