హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్లోబల్ సిటీ ర్యాంకింగ్స్‌లో గుంటూరు సత్తా

GNTR: ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్-2026లో ఏపీకి చెందిన నాలుగు నగరాలు చోటు దక్కించుకున్నాయి. వెయ్యి నగరాల్లో గుంటూరు 739వ ర్యాంకుతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. విశాఖ 755, నెల్లూరు 893, విజయవాడ 932వ స్థానాలు సాధించాయి. ఆర్థిక వ్యవస్థ, జీవన నాణ్యత తదితర ప్రమాణాల ఆధారంగా ఈ ర్యాంకులు ప్రకటించారు.