హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుడిసెను ధ్వంసం చేసిన ఏనుగు

TPT: యర్రావారిపాళెం మండలంలో ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. రైతు నారాయణకు చెందిన గుడిసెను ధ్వంసం చేయడంతో పాటు, పరిసర ప్రాంతంలోని కొబ్బరి చెట్లను కూడా ఏనుగు ధ్వంసం చేసింది. దీంతో రైతుకు నష్టం వాటిల్లింది. ఏనుగు సంచారంతో స్థానికులు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి ఏనుగును అడవిలోకి తరలించాలని కోరుతున్నారు.