హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాలివీడులో ఆకట్టుకుంటున్న వినాయక విగ్రహం

అన్నమయ్య: గాలివీడు పావని సర్కిల్‌లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కళ్లుమూసి తెరిచేలా రూపొందించిన విగ్రహాన్ని చూసేందుకు భక్తులు, స్థానికులు ఆసక్తిగా తరలివస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ అన్నదానం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. బుధవారం వినాయక నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.