హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హోటల్లో అగ్నిప్రమాదం..!

కోనసీమ: యానాంలోని ఓ హోటల్లో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హోటల్ నుంచి మంటలు చెలరేగడంతో స్థానికులు, సిబ్బంది అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. హోటల్ పక్కనే ఐఓబీ పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.