హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిమజ్జనాలను పరిశీలించిన ఎస్పీ

కర్నూలులో గణేష్ నిమజ్జనాలను ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. అంతకుముందు రాంబొట్ల దేవాలయంలో ఆయన పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి శాల వరకు కాలినడకన పర్యటించి శోభాయాత్ర మార్గాలను పరిశీలించారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రత, శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.