E.G: ఎస్సీ నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో 15 పథకాలు అందుబాటులో ఉన్నాయని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జి.గౌరీశంకర్రావు తెలిపారు. పరిశ్రమలు, సేవలు, వ్యాపార రంగాల్లో యూనిట్ల ఏర్పాటుకు రుణాలు, సబ్సిడీలు పొందవచ్చన్నారు. ముద్రా యోజన, విశ్వకర్మ, ఉపాధి కల్పన, మత్స్య సంపద, ఆయిల్పామ్ తదితర పథకాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్సీ యువతకు ఉపాధి పథకాలు


