KKD: వివిధ సమస్యలపై పవన్ను కలిసేందుకు పలువురు సోమవారం పిఠాపురం వచ్చారు. అయితే ఆయనను కలిసేందుకే కొందరికే అవకాశం లభించింది. 12 ఏళ్ల దివ్యాంగుడు సుబ్రహ్మణ్యం పింఛన్ కోసం తల్లి కళావతితో కలిసి వచ్చాడు. పలుమార్లు దరఖాస్తు చేసినా పింఛన్ మంజూరు కాలేదని వాపోయారు. అయితే అధికారులు వారిని ఎమ్మెల్యేను కలవనీయలేదు. మరో దివ్యాంగురాలిని ట్రైసైకిల్‌పై తీసుకొచ్చినా పవన్‌ను కలిసే అవకాశం రాలేదు.
ఆంధ్రప్రదేశ్
పవన్ కోసం వచ్చి.. నిరాశతో బాధితులు


