హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జిల్లా పరిషత్ సమావేశం

విశాఖపట్నం జడ్పీ సమావేశ మందిరంలో ఇవాళ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్తు సీఈఓ పి.నారాయణమూర్తి తెలిపారు. విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్ఆర్ జిల్లాలకు సంబంధించి అధికారులు పూర్తి నివేదికలతో హాజరు కావాలని సూచించారు.ఈ సమావేశంలో జిల్లాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షించనున్నట్లు తెలిపారు.