ప.గో: కాళ్ల మండలం పెదఅమిరంలో లిబర్టీ ఫ్యాక్టరీ వద్ద వాకింగ్ చేస్తున్న ఉపాధ్యాయుడు వెంకటరత్నంపై గుర్తుతెలియని దుండగుడు రాడ్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రాణాపాయ స్థితిలో భీమవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉండి మండలం ఎన్.ఆర్.పి అగ్రహారం పాఠశాలలో ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కాళ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పెదఅమిరంలో ఉపాధ్యాయుడిపై దాడి


