నెల్లూరు జిల్లా పోలీసులకు మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్ను ఎస్పీ డా.అజిత వేజెండ్ల సోమవారం ప్రారంభించారు. నేరస్థలాల్లో ఆధారాలను గుర్తించి, సేకరించి భద్రపరిచేందుకు అధునాతన పరికరాలను వ్యాన్‌లో ఏర్పాటు చేశారు. కేసుల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాల సేకరణను వేగవంతం చేయడమే లక్ష్యంగా వ్యాను అందుబాటులోకి తీసుకొచ్చారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్ ప్రారంభం


