హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

W.G: భీమవరం-ఉండి రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్ల నడుమ 50-55 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెంది ఉంటాడని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.