హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజలకు అందుబాటులో ఉండాలి'

VZM: తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని బొబ్బిలి మున్సిపల్ కమిషనర్‌ రామలక్ష్మి ఆదేశించారు. సోమవారం ఉద్యోగులతో ఆమె సమావేశం నిర్వహించారు.ప్రజలు తాగునీరుకు ఇబ్బందులు పడకుండా చూడాలని,అవసరమైన చోట ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేయాలన్నారు. పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా చూడాలన్నారు.