హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం షాపుల రెన్యువల్ గడువు పెంపు

SS: జిల్లాలో మద్యం షాపుల రెన్యువల్ గడువును ఈనెల 23వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ప్రస్తుత లైసెన్స్ ఫీజుపై 38 శాతం అదనంగా చెల్లించి రెన్యువల్ చేసుకునే అవకాశం కల్పించింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగియాల్సిన గడువును పొడిగించినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి బి. రామమోహన్‌రెడ్డి తెలిపారు.