ప.గో: భీమవరం అల్లంవారి తోటకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని మాధవి(14) ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. రాత్రి కనిపించకుండా పోయిన బాలికను ఆటో డ్రైవర్ ఇంటి వద్ద సీఐ గుర్తించి తండ్రికి అప్పగించారు. అయితే సోమవారం ఉదయం ఆమె ఇంట్లోనే శవమై తేలడంతో విషాదం అలుముకుంది. ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి బలవన్మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
భీమవరంలో తొమ్మిదో తరగతి బాలిక ఆత్మహత్య


