ATP: తాడిపత్రి మండలం వీరాపురంలో నిషేధిత జాబితాలో ఉన్న 6.75 ఎకరాల అసైన్డ్ భూములకు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసిన ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. నాటి తాడిపత్రి సబ్ రిజిస్ట్రార్ బసవరాజు, సీనియర్ అసిస్టెంట్ మంజునాథ్ యాదవ్‌లను సస్పెండ్ చేశారు. ఈ మేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ విజయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు


