హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 38 ఆశా కార్యకర్తల పోస్టులకు నోటిఫికేషన్

కడప: జిల్లాలో 38 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి డీఎంహెచ్‌ఓ యుగంధర్ ప్రకటన విడుదల చేశారు. ఇందులో 27 రూరల్, 11 అర్బన్ పోస్టులు ఉన్నాయి. అర్హులైన మహిళలు సెప్టెంబర్ 23-26లోపు స్థానిక పీహెచ్‌సీ, యూహెచ్‌సీ లేదా సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 1న తుది జాబితా విడుదల కానుంది. వివరాలకు kadapa.ap.gov.in చూడాలి.