హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మెరైన్ పోలీస్ స్టేషన్లకు మౌలిక సదుపాయాలు: కలెక్టర్

కృష్ణ: జిల్లాలోని మెరైన్ పోలీస్ స్టేషన్లకు మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించాలని కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన సోమవారం జిల్లా స్థాయి తీర ప్రాంత అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. మెరైన్ స్టేషన్లకు రహదారుల సౌకర్యం, ప్రహరీ గోడలు, తాగునీటి వసతి తదితర అంశాలపై సమీక్షించారు. ఒర్లగొందితిప్ప మెరైన్ స్టేషన్ కు గ్రావెల్ రోడ్డు వేయాలన్నారు.