హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దుర్గమ్మ సేవా టికెట్ల పేరుతో మోసం.. వ్యక్తి అరెస్ట్

ఎన్టీఆర్: దసరా నవరాత్రుల నేపథ్యంలో ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సేవా టికెట్ల పేరుతో మోసానికి పాల్పడిన వ్యక్తిని NTR సైబర్ క్రైమ్ పోలీసులు 24 గంటల్లో అరెస్ట్ చేసినట్లు DCP కృష్ణ ప్రసన్న తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టగా, అసలు టికెట్‌ను ఎడిట్ చేసి నకిలీ టికెట్ తయారు చేసినట్లు గుర్తించామన్నారు.