హైదరాబాద్: 28°C
తెలంగాణ

UPDATE: భూ వివాదమే తండ్రి హత్యకు కారణం

NRPT: మక్తల్ మండలం తిర్లాపూర్ గ్రామంలో భూ వివాదం తండ్రి ప్రాణం తీసింది. పొలాన్ని రిజిస్ట్రేషన్ చేయాలని కొడుకులు కృష్ణ, వెంకటేష్ గత కొంతకాలంగా తండ్రి గొల్ల రాములుతో గొడవపడుతున్నారు. బంధువుల మాటలతో కక్ష పెంచుకున్న ఇద్దరు సోమవారం తండ్రిని ఇంట్లో బంధించి ఇనుప పలుగుతో దారుణంగా కొట్టి చంపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.