హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాటర్ హార్వెస్టింగ్ పాండ్ పనులు ప్రారంభం

JGL: వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామంలో సోమవారం వర్షపు నీటి సంరక్షణ దిశగా కీలక అడుగు పడింది. VBG RAM-Gపథకంలో భాగంగా వాటర్ హార్వెస్టింగ్ పాండ్ నిర్మాణ పనులను స్థానిక సర్పంచ్ భూపల్లి రాజయ్య ప్రారంభించారు. వర్షపు నీటిని నిల్వ చేసి భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు గ్రామంలోని నీటి వనరులను సంరక్షించేందుకు ఈ పాండ్ ఉపయోగపడుతుందని తెలిపారు.