JN: పెద్దపహాడ్‌లో గొర్రెల సంఘానికి చెందిన 4.04 ఎకరాల భూమిని ఫోర్జరీ సంతకాలతో ఉస్మానియా అగ్రో ఇండస్ట్రీస్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుందని సభ్యులు ఆరోపించారు. 2005లో కొనుగోలు చేసిన ఈ భూమిని 2007లో అక్రమంగా మార్చేశారని తెలిపారు. దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ.. కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
గొర్రెల సంఘం భూమి అక్రమ రిజిస్ట్రేషన్


