హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయం'

PPM: ప్రజా సమస్యలను విని, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులను స్వీకరించారు. పింఛన్లు, గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు, గృహాలు, భూ సమస్యలతో పాటు పలు అంశాలపై ప్రజలు ఎమ్మెల్యేకు వినతిపత్రాలు అందజేశారు.