హైదరాబాద్: 28°C
తెలంగాణ

హయత్‌నగర్‌లో క్లినిక్ సీజ్

RR: హయత్‌నగర్‌లోని అజయ్ క్లినిక్‌ను రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీజ్ చేశారు. డీఎంహెచ్‌ఓ డా. స్వర్ణకుమారి ఆదేశాలతో అధికారులు తనిఖీలు చేపట్టారు. రిజిస్టర్డ్ డాక్టర్ అందుబాటులో లేని సమయంలో అర్హత లేని వ్యక్తి వైద్యం అందిస్తుండటంతో చర్యలు తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ హెచ్చరించారు.