SDPT: గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి టి.జ్ఞానేశ్వర్ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో బంగారు పతకం సాధించి సాధన చాటాడు. 100 మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానంలో నిలవడంతో ఈనెల 27న వరంగల్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు ప్రిన్సిపల్ నిఖత్ అంజూమ్ పేర్కొన్నారు. ప్రతిభ కనబరిచిన జ్ఞానేశ్వర్‌ను కళాశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించారు.
తెలంగాణ
పరుగు పందెంలో జ్ఞానేశ్వర్ ప్రథమ స్థానం


