హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబుకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే

CTR: కుప్పం పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్వాగతం పలికారు. తుమ్మసి హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎంను ఎమ్మెల్యేతో పాటు చిత్తూరు నియోజకవర్గ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చంద్రబాబుతో నాయకులు చర్చించారు. అనంతరం పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే, స్థానిక నాయకులు పరిశీలించారు.