హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సామాన్యుడిలా ప్రభుత్వాసుపత్రికి ఎమ్మెల్యే

E.G: నియోజకవర్గ కార్యక్రమాల్లో పాల్గొంటున్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి సోమవారం తీవ్ర మోకాలి నొప్పి వచ్చింది. దీంతో ఆయన అనపర్తి ఏరియా ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. ప్రైవేటు ఆసుపత్రికి కాకుండా సాధారణ పౌరుడిలా ప్రభుత్వాసుపత్రికి వచ్చిన ఎమ్మెల్యేను ఆర్థోపెడిక్ వైద్యులు పరీక్షించారు. ఎక్స్‌రే తీసి చికిత్స అందించి, తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.