ASR: పార్టీకి నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలకే ప్రాధాన్యం ఉంటుందని అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం అన్నారు. డుంబ్రిగుడలో పార్టీ శ్రేణులకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సమష్టిగా సిద్ధం కావాలని, బూత్ కమిటీలను పటిష్టం చేయాలన్నారు. వ్యక్తుల కోసం పనిచేసేవారికి టికెట్లు ఉండవని, పార్టీ బలోపేతానికి కష్టపడిన వారికే టికెట్లు ఇస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పార్టీయే ముఖ్యం.. ఎన్నికలకు సిద్ధం కావాలి'


