హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వారపు సంతలో రోడ్డు భద్రతపై అవగాహనా ర్యాలీ

ASR: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చింతపల్లి సీఐ బీ.సింహాచలం, అన్నవరం ఎస్సై సాయిరామ్ వాహనదారులకు సూచించారు. సోమవారం అన్నవరం వారపు సంతను సందర్శించారు. వాహనదారులతో ర్యాలీ నిర్వహించారు. డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్), వాహనానికి సంబంధించిన ఇతర పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి, ప్రమాదాలను నివారించాలని కోరారు.