హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసిన BKS

BDK: భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో సోమవారం రైతుల సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. గత వేసంగిలో మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిన వరి, మొక్కజొన్న పంటలకు గన్నీబస్తాల కొరత ఏర్పడింది. దీంతో రైతులు తమ సొంత డబ్బులతో అధిక ధరలకు కొన్న గన్నీబస్తాల నిధులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరారు. రైతుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.