హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి వినతి'

ELR: రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 11,000 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లా కన్వీనర్ తోర్లపాటి రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారని, ప్రస్తుతం విడుదల చేసిన 2,050 పోస్టుల నోటిఫికేషన్ సరిపోదన్నారు.