ADB: ఉట్నూర్ మండలం ఘనపూర్‌లో PM జన్మన్ పథకం కింద సుమారు రూ.60 లక్షల వ్యయంతో నిర్మించనున్న మల్టీపర్పస్ భవన నిర్మాణ పనులకు ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా మల్టీపర్పస్ భవనం నిర్మాణం చేపట్టడం పట్ల MLA సంతోషం వ్యక్తం చేశారు. గ్రామంలో వివిధ సామాజిక, ప్రజా కార్యక్రమాలకు భవనం ఉపయోగపడనుందని తెలిపారు.
తెలంగాణ
మల్టీపర్పస్ భవన నిర్మాణానికి MLA భూమి పూజ


