హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎలుగుబంటి వేషంలో రైతు

SRPT: తుంగతుర్తి మండలంలో కోతుల బెడదతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పత్తి, వరి తదితర పంటలను కోతులు నాశనం చేస్తుండటంతో రైతులు నష్టపోతున్నారు. కర్రలు, రాళ్లతో తరిమినా బెడద తగ్గడం లేదు. మనుషులపైకి సైతం దాడులకు వస్తున్నాయి. దీంతో మండల కేంద్రానికి చెందిన బోయిని నాగయ్య ఇవ్వాళా ఎలుగుబంటి వేషధారణతో పంట పొలాల వద్ద తిరగడంతో కోతులు భయంతో పరుగులు తీశాయి.