హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరువు మండలాలుగా ప్రకటించాలని నిరసన

GNTR: పెదనందిపాడు, కాకుమాను మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కౌలు రైతు సంఘం నేతలు డిమాండ్‌ చేశారు. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సోమవారం నిరసన చేపట్టారు. వర్షాలు లేక పంటల సాగు జరగడం లేదన్నారు. వేసిన పంటలు కూడా ఎండిపోతున్నాయని తెలిపారు. రైతులు, కౌలు రైతులకు రూ.10 వేల సాయం, ఉచిత విత్తనాలు అందించాలని, పశుగ్రాసం, తాగునీటి కొరత లేకుండా చూడాలన్నారు.