హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీ కేంద్రంలో అవగాహన

విశాఖ 37వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో సోమవారం 7వ జాతీయ పోషణ మాసోత్సవాలు ఘనంగా జరిగాయి. పిల్లల సమగ్ర వికాసానికి, ఉజ్వల భవిష్యత్తుకు పోషకాహారం, ప్రేమతో కూడిన సంరక్షణ అత్యంత కీలకమని ఐసీడీఎస్ అర్బన్ ప్రాజెక్ట్ సూపర్ వైజర్ ఇందిర స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలకు పోషకాహారంపై అవగాహన కల్పించారు.