అన్నమయ్య: సంబేపల్లి మోటాకట్ల గ్రామం కాకరపల్లి సమీపంలో పశువుల మేత తరలిస్తున్న ట్రాక్టర్‌కు విద్యుత్ తీగలు తగలడంతో మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ట్రాక్టర్ ఇంజన్‌తో సహా పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సంబేపల్లిలో ట్రాక్టర్ దగ్ధం


