హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుది ముసాయిదా ఓటరు జాబితా విడుదల

AKP: యలమంచిలి పురపాలక సంఘ సాధారణ ఎన్నికలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను గుర్తించి తుది ముసాయిదా ఓటర్ జాబితాను ప్రచురించినట్లు కమిషనర్ ప్రసాదరాజు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఫారం-6 ద్వారా జాబితాను సిద్ధం చేశారు. యలమంచిలి పురపాలక సంఘం కార్యాలయం, ఎంఆర్‌ఓ కార్యాలయం, ఆర్‌డీఓ కార్యాలయం అడ్డురోడ్డులో జాబితాను అందుబాటులో ఉంచారు.