VZM: గజపతినగరం (మం) బంగారమ్మపేట గ్రామానికి చెందిన కొలుసు అప్పలరాజు (37) సోమవారం ఉదయం చెట్టుపై నుంచి జారిపడి మృతి చెందినట్లు భార్య గౌరి తెలిపారు. అప్పలరాజుకు కుమారుడు మణికంఠ (16), కుమార్తె విజయ (13) ఉన్నారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న అప్పలరాజు మృతితో భార్య, పిల్లలు దిక్కుతోచని స్థితిలో పడ్డారని గౌరి ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
చెట్టు పైనుంచి జారిపడి వ్యక్తి మృతి


