హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆధునిక తెలుగు సాహిత్యానికి ఆదిగురువు గురజాడ'

VSP: మహాకవి గురజాడ అప్పారావు 164వ జయంతి సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో 'ఆధునిక తెలుగు సాహిత్య దినోత్సవం' సోమవారం జరిగింది. శాఖాధిపతి ఆచార్య జర్రా అప్పారావు గురజాడ చిత్రపటానికి నివాళులర్పించి మాట్లాడుతూ.. ఆయన జననం తెలుగు సాహిత్యానికి అరుణోదయమన్నారు. అరసం నాయకుడు అప్పలరాజు, ఆచార్య సిమ్మన్న తదితరులు గురజాడ రచనల విశిష్టతను కొనియాడారు.