హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన

కోనసీమ: అమలాపురం మండలం భట్నవిల్లి కొత్తచెరువు వాసులు గ్రామానికి తాగునీరు అందించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. స్థానిక బీఎస్పీ నేతలు నిరసనకు సంఘీభావం తెలిపారు. అనంతరం పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు చేశారు. తాగునీరు అందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.