NLR: జిల్లా కలెక్టరేట్‌లో గురజాడ అప్పారావు జయంతి వేడుకలు నిర్వహించారు. జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్‌కుమార్ గురజాడ చిత్రపటానికి నివాళులర్పించారు. సమానత్వం, చైతన్యం, మానవతా విలువల పెంపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జేసీ పిలుపునిచ్చారు. సామాజిక దురాచారాలను ప్రశ్నిస్తూ వాడుక భాషలో రచనలు చేసి గురజాడ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని గుర్తుచేశారు.
ఆంధ్రప్రదేశ్
గురజాడ రచనలు ప్రజల్లో చైతన్యం: జేసీ


