హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘కర్నూలును కరువు ప్రాంతంగా ప్రకటించాలి’

కర్నూలును కరువు ప్రాంతంగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర నాయకులు హనుమంతు, సిద్దయ్యగౌడ్, కొండారెడ్డి సోమవారం డిమాండ్ చేశారు. పంట నష్టానికి ఎకరాకు రూ.50 వేల పరిహారం, పంట రుణాల మాఫీ చేయాలని కోరారు. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి 200 రోజుల ఉపాధి పనులు కల్పించాలని కోరుతూ ఆర్డీఓ ఓబులేసుకు వినతిపత్రం అందజేశారు.