హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆరిలోవలో వైభవంగా గణేష్ అన్నసమారాధన

VSP: ఆరిలోవ 11వ వార్డు దుర్గానగర్ సంఘం, DNC యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 2,500 మందికి అన్నసమారాధన జరిపారు. ఈ కార్యక్రమానికి వైసీపీ సీనియర్ నాయకులు గొలగాని శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై పూజలు చేసి, భక్తులకు స్వయంగా ప్రసాదాలు వడ్డించారు. ప్రతిఏటా వేడుకలు జరుపుతున్న నిర్వాహకులను ఆయన అభినందించారు.