హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విద్యుత్ డిఈఈగా పెద్దయ్య బాధ్యతల స్వీకరణ'

అన్నమయ్య: ఏపీ ఎస్పీడీసీఎల్ ఆపరేషన్ చిట్వేలి విద్యుత్ సబ్ స్టేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా కే. పెద్దయ్య పదవి బాధ్యతలు స్వీకరించారు. సోమవారం డిఈఈ కార్యాలయంలో ఇంచార్జ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాలాజీ నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి విద్యుత్ సక్రమంగా సరఫరా చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.