హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి'

KRNL: ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీ గ్రౌండ్ సమీపంలో జమాతే ఇస్లామీ హింద్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వైద్య నిపుణుడు ఫయాజుద్దీన్ యువతకు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరించి, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. చెడు అలవాట్లకు బానిస కాకుండా ‘మంచిని ప్రేమించు.. చెడును వదులు’ అనే సూక్తిని అలవర్చుకోవాలని కోరారు.